మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదల కానుంది. ఇక అసలు విషయానికి వస్తే ఉమైర్ సంధు మెగాస్టార్ పై ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేసాడు. నేషనల్ అవార్డు చిరంజీవి కోసం ఎదురుచూస్తుందని, ఈ చిత్రం లో తన నటనతో పాత్రకు జీవం పోసాడని ఆయన అన్నాడు. ఆయన అన్నాడంటే అది నూటికి నూరు శాతం నిజం అవుతుందని అందిరికి తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్ పై ప్రసంసల జల్లు కురిపించిన సంధు ఇప్పుడు ఇలా ట్వీట్ చేయడంపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
