తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విధితమే. ఇప్పటికే ఈ ఎన్నిక గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి ఇప్పటికే నామినేషన్ వేశారు. అయితే ఈ రోజే నామినేషన్ పర్వానికి అఖరి తేది కావడంతో ఇతర పార్టీల అభ్యర్థులు కూడా ఈ రోజు నామినేషన్ వేయనున్నారు.
