వీరిద్దరి కలయికతో ఎలాంటి వార్తలు గుప్పుమంటాయో అని ఎదురు ప్రేక్షకులకు వీరి భేటీ వాయిదా పడింది. మెగాస్ఠార్ చిరంజీవి, సీఎం జగన్ లు ఈరోజు పదకొండు గంటలకు భేటీ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ నెల 14న కలియనున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ భేటీ ప్రధాన కారణం గత రెండు రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ కి సినిమా చూపించటం జరిగింది. ఈ సినిమా చూసిన గవర్నర్ సైరా సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు. అందులో భాగంగా జగన్ ని కూడా కలిసి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దాని కోసమే కలుస్తున్నారా.. లేక మరేదైన కారణాలతో కలుస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
