తెలంగాణలో సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సమీకృత మార్కెట్ లో శుక్రవారం ఉదయం దివంగత రైతు నాయకుడు మారెడ్డి హన్మంత రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, సుడా ఛైర్మెన్ మారెడ్డి రవీందర్ రెడ్డితో కలిసి తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ముందుగా హన్మంత రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి మౌనం వహించిన అనంతరం.. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. హన్మంత రెడ్డి గారి మృతి రైతు రక్షణ సమితికే కాదు., తనకు వ్యక్తిగతంగా ఎంతో లోటని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం రాజీలేని పోరాటం చేశారని., ఉపాధ్యాయ ఉద్యోగ పదవి విరమణ మరుక్షణం నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే రైతు సమస్యలపై మడమ తిప్పని పోరాటం చేశారని., పండగలను సైతం లెక్క చేయకుండా సిద్ధిపేట పాత బస్టాండ్ సర్కిల్ లో చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన రిలే నిరాహారదీక్షలు చేయటంలో క్రియాశీలక పాత్రA పోషించారని కొనియాడారు. రైతు విద్యుత్ సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్ల కోసం దీక్షలు, రైతుల సమస్యలపై చేసిన పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని ఆయన చేసిన గత స్మృతులను గుర్తు చేశారు.
ఢిల్లీలో జరిగిన రైతు పోరాటంలోనూ ముందు నిలిచిన నిస్వార్థ రైతు నాయకుడు మారెడ్డి హన్మంత రెడ్డని, ఆయన క్యాన్సర్ బారిన పడి మృతి చెందటం బాధాకరమని.. బాధను వ్యక్తం చేస్తూ.. తన ప్రజా జీవితం ప్రజల కోసమే పని చేశారని చెప్పారు. రైతులకు మేలు జరిగే విధంగా మనమంతా కూడా.. ముందుకు సాగినప్పుడే ఆయన ఆత్మకు నిజమైన శాంతి చేకురుతుందని వెల్లడించారు. ప్రయివేట్ రుణాల మాఫీ విషయంలో కృషి చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ హామీ ఇచ్చారు.
Post Views: 256