సికింద్రాబాద్ నియోజకవర్గం లో ప్రతిష్టత్మకరంగా నిర్మిస్తున్న సీతాఫల మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ ను ప్రజల విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదివారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఫంక్షన్ హాల్ లో స్థానిక టీఆర్టీ క్వార్టర్స్ కు చెందిన్ లక్ష్మి ప్రసన్న, గిరిప్రసాద్ ముదిరాజ్ ల వివాహానికి పద్మారావు గౌడ్ హాజరై నూతన వధువరులను దీవించడంతో పాటు హాల్ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులు తుది దశలో ఉండగా, జంటనగరాల్లోనే మోడల్ గా AC ఫంక్షన్ హాల్గా రూపుదిద్దుకోనుంది. వివిధ వర్గాల వారితో చర్చించి, హాలును అద్దె లేకుండా ఇస్తూనే కేవలం రూ.25 వేల మేరకు మాత్రమే నిర్వహణ ఖర్చు గా (maintainance charges) వసూలు చేయాలని నిర్ణయించినట్లు పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇప్పటికే రెండంతస్తుల ముల్తిపుర్పోసే ఫంక్షన్ హాల్ ను ప్రత్యేక ఎలివేషన్, వెలుపలి స్టిర్ కేస్ తో విభినంగా నిలిచే లైటింగ్,ఆర్వో ప్లాంట్, పార్కింగ్ ఇతరత్రా సదుపాయాలతో తీర్చిదిద్దగా, ac యూనిట్లు, జెనరేటర్, కాంపౌండ్ వాల్, వెలుపలి లైటింగ్ వంటి వివిధ ఇతరత్రా పనులను పూర్తిచేయాల్సి వుంది. వీలైనంత త్వరగా అన్ని పనులను పూర్తీ చేయాలనీ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
Post Views: 393