నెల్లూరులో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన రైతు భరోసా పథకాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఇచ్చిన మాటకు అదనంగా మరో వేయి రూపాయిలు జోడించి 13500 రూపాయలతో రైతు అన్నలకు అండగా నిలిచింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జగన్ పాలనను చూసి ఎమోషనల్ అయ్యారు. తనకు ఒక బీసీకి మంత్రి పదవి ఇచ్చిన ఘనత మా అన్న జగన్ గారిదని అన్నారు. ఈ జీవితానికి ఇది చాలు అని, ఇంకే అవసరం లేదన్నారు. ఈ ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకు బంటుగా, అనుచరుడుగా ఉన్నానని అన్నారు. ఈ జీవితం మొత్తం జగన్ గారితోనే అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు మంత్రి అనిల్ యాదవ్. అలాగే ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్ గారి కృతజ్ఞలు తెలిపారు.
