ఏపీలో చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రా బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. అమరరాజా పరిశ్రమ ఆవరణంలోని బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన మొత్తం పదిహేను తులాల బంగారం,రూ.2.66 లక్షల నగదును దొందలు ఎత్తుకెళ్లారు.
ఈ దొంగతనంలో బ్యాంకు మేనేజర్,క్యాషియర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.