తెలుగు రాష్ట్రాల్లో డెంగీ పంజా విసురుతోంది. సామన్యప్రజలతో పాటు అందరిపై డెంగీ విరుచుకుపడుతుంది. తాజాగా జీ తెలుగు ఛానెల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్, ఆట జూనియర్స్ లాంటి టీవీ షోల్లోనటించే …జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ డెంగీ జ్వరంతో మరణించాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఏవి నాయుడు కాలనీకి చెందిన బాలనటుడు సుమాంజలి రెండవ కుమారుడైన గోకుల్ సాయి.. రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రుల…బాలుడిని బెంగళూరులోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోకుల్ సాయి గురువారం రాత్రి మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు టీవీ ఆర్టిస్టులు విషాదంలో ఉన్నారు. జీ తెలుగు చానెల్లో సాయికృష్ణ పాల్గొన్నాడు.
