బాలీవుడ్ దుమ్మురేపిన నటి మోడల్ ప్రియాంక చోప్రా…హలీవుడ్ సినిమాల్లోను తన సత్తా చాటింది. చాలా వరకు అక్కడ ఇండస్ట్రీలో పనిచేసిన ప్రియాంక క్రమంగా అక్కడే సింగర్ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అక్కడే సెటిల్ అయింది. వీరిద్దరు ఎప్పటికప్పుడు వాళ్ల విషయాలను షేర్ చేసుకుంటూ… అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంటారు. అయితే తాజాగా ప్రియాంక షేర్ చేసిన విషయం జనాలకు ముచ్చటగా అనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో చాలా ఆచారాలు ఉన్నాయి.అందులో కర్వాచౌత్ అనేది నార్త్ లో బాగా చేస్తారు. పెళ్లైన అమ్మాయి.. వాళ్ల భర్తల కోసం ఉపవాసం చేసి జల్లెడలో తన భర్త ముఖాన్ని చూస్తే… మంచి జరుగుతుందని వాళ్ల నమ్మకం…ఇదే విషయాన్ని ప్రియాంక భర్త చెబుతూ…తన భార్య ఇండియా అని, తను అక్కడి సాంప్రదాయాల గురించి చెబుతుంటుంది అని. అవి చాలా బాగుంటాయని అవి తనకి కూడా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పండగ సందర్బంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
