2014 తరువాతే బ్రాహ్మణులకు తెలంగాణలో గౌరవం పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన చొరవే కారణమని ఆయన అభివర్ణించారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పుష్కరాల నుండి రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు కావడమే ఇందుకు నిదర్శమన్నారు.అందులో భాగమే ఈ రోజు మీ ఎదురుగా ఉండి ఓట్లు అభ్యర్దిస్తున్న టి ఆర్ యస్ పార్టీ అభ్యర్థి శానం పూడి సైదిరెడ్డి ని ఆశీర్వదించాలని ఆయన కోరారు. మట్టపల్లి బ్రాహ్మణసత్రం లో జరిగిన ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధి గా హాజరయ్యారు.
రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ చకిలం అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శాసనమండలి సభ్యులు పురాణం సతీష్ శాసనసభ్యులు వడితేల సతీష్ రాష్ట్ర నాయకులు వేణుగోపాలా చారి,నాయకులు కే వి రామారావు,హరిలక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పురాణఇతిహాసాల లో మట్టపల్లి దేవలయనికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు.అటువంటి దేవాలయాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ ప్రతినిధిగా మా మీద ఉందన్నారు.సమాజంలో బ్రాహ్మణుల మీద గౌరవం పెంపొందించేందుకు కారణం అయిన టి ఆర్ యస్ పార్టీని ఈ ఉపఎన్నికలలో ఆదరించాలని ఆయన కోరారు..