ప్రస్తుతం అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో..ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నట్రైలర్ కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ ట్రైలర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీసిన ఈ సినిమాలో చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్, కేఏ పాల్.. ఇలా కీలకమైన వ్యక్తులంతా ఉన్నారు. కానీ ట్రయిలర్ లో ఓ వ్యక్తికి మాత్రం చోటు దక్కలేదు. అతడే నందమూరి బాలకృష్ణ. అవును.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రయిలర్ లో బాలయ్య లేడు. చివరికి కేఏ పాల్, బ్రాహ్మణి, దేవాన్ష్ లకు కూడా చోటు కల్పించిన రామ్ గోపాల్ వర్మ.. బాలయ్యను మాత్రం చూపించలేదు. ట్రయిలర్ లో క్యారెక్టర్లతో పాటు.. ట్రయిలర్ లో లేని బాలయ్య పాత్రపై ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ మొదలైంది. అంతేకాదు బాలయ్యకు ఆర్జీవీ స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నాడనే చర్చ మొదలైయ్యింది. బాలయ్య పాత్రకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ క్లిప్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాలో మరిన్ని సంచలనాలు ఉన్నట్టు కనిపిస్తోంది.
