బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే అయిదుగురు అని టక్కున చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మారబోతోంది. ఏంటి? ఎవరినైనా ఎలిమినేట్ చేస్తున్నారా? అని అనుకోకండి. గతంలో ఎలిమినేట్ అయినవారినే తిరిగి హౌస్‌లోకి రప్పించనున్నారు. బిగ్‌బాస్ షో ముగియడానికి రెండు రోజులు మాత్రమే మిగలడంతో ఫైనల్ కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురానున్నారు. వీరు చేసే అల్లరితో నేటి ఎపిసోడ్ దద్దరిల్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హేమ జాఫర్, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, రవి, మహేశ్, శివజ్యోతి, హిమజ, తమన్నా, శిల్పా చక్రవర్తి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టారో మళ్లీ అంతా అక్కడికే చేరినట్టు తెలుస్తోంది.
