Home / SLIDER / గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ప్రారంభం

గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి చౌటుప్పల్‌ మండలంలోని దండు మల్కాపూర్‌ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు”ను ప్రారంభించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్‌.
 
ఈ సందర్భంగా పైలాన్‌ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం పార్కులోని పరిశ్రమల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శ్రీ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ శ్రీ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ శ్రీ బూర నర్సయ్య గౌడ్, పలువురు ప్రజా ప్రతి నిధులతో పాటు దాదాపు 2 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.