తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గోదావరి ఖనికి చెందిన అజయ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2 లక్షలను ఎల్వోసీ అందజేశారు.
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అజయ్ కు చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిన్న గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తన కార్యాలయంలో ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు.