Home / MOVIES / ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవని రాహుల్‌ టైటిల్‌ విన్నర్..కారణం వీరేనా

ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవని రాహుల్‌ టైటిల్‌ విన్నర్..కారణం వీరేనా

జూలై 21న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్‌బాస్‌-3 నవంబర్‌ 3న అంతే ఘనంగా ముగిసింది. సీజన్‌ చివరి రోజుల్లో అనూహ్యంగా పుంజుకున్న రాహుల్‌ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. రాహుల్‌ గెలుపునకు గల కారణాలు ఓసారి పరిశీలించినట్టయితే… శ్రీముఖితో వైరం రాహుల్‌కు సానుభూతి తెచ్చిపెట్టగా.. అది ఓట్ల రూపంలో కనిపించింది. దాంతోపాటు పునర్నవితో రిలేషన్‌షిప్‌ ప్రేక్షకులను అలరించింది. పున్నూ ఫ్యాన్స్‌ కూడా రాహుల్‌కే జై కొట్టారు. ఇంటి సభ్యులు రాహుల్‌ను నామినేట్‌ చేసిన ప్రతీసారి అతని బలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన రాహుల్‌ చివరాఖరికి ఇంటి సభ్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. బద్ధకస్తుడు అన్న పేరును తెచ్చుకున్న రాహుల్‌ మొట్టమొదటగా ‘టికెట్‌ టు ఫినాలే’ సాధించి తనేంటో రుజువు చేసుకున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదే చెప్పడం.. ఎలాంటి భేషజాలానికి పోకుండా తప్పు చేస్తే సారీ చెప్పడం.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక రాహుల్‌ హైదరాబాదీ యాసతో ఇంటి సభ్యులు కొన్నిసార్లు నొచ్చుకున్నారు. రాహుల్‌ తమను తిడుతున్నాడని హోస్ట్‌ నాగార్జునకు ఫిర్యాదు చేశారు. దీంతో నాగ్‌ సైతం రాహుల్‌ను జాగ్రత్తగా మాట్లాడాలని సూచించాడు. అయితే, ప్రేక్షకులు మాత్రం రాహుల్‌ బోల్డ్‌ రియాక్షన్స్‌కి ఫిదా అయ్యారు. వీటన్నిటికీ తోడు రాహుల్‌ కొత్తకొత్త బాణీలతో, తన గాత్రంతో అటు ఇంటి సభ్యులను, ఇటు ప్రేక్షకులను అలరించాడు. ఫేక్‌ ఎలిమినేషన్‌, రీఎంట్రీ రాహుల్‌ క్రేజ్‌ను రెట్టింపు చేశాయి. రాహుల్‌ ఫేక్‌ ఎలిమినేషన్‌ సమయంలో పునర్నవీ, పున్నూ ఎలిమినేషన్‌ సమయంలో రాహుల్‌ ఎమోషన్స్‌ను ప్రేక్షకులు కూడా ఫీల్‌ అయ్యారు. సింగర్‌, నటుడు నోయెల్‌.. రాహుల్‌కు అండగా నిలవటం అతనికి మరింత ప్లస్‌ అయ్యింది. మరీ ముఖ్యంగా రాహుల్‌ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడని, అతను లైఫ్‌లో ఇంకా సెటిల్‌ అవాల్సి ఉందని కూడా జనాలు గెలిపించేందుకు ఓ కారణమైంది. తన బార్బర్‌ వృత్తికి గౌరవం ఇవ్వడం కూడా అతని విలువను రెట్టింపు చేసింది. గల్లీ సింగర్‌ నుంచి ఎదిగిన తీరును దగ్గరుండి చూసిన జనం అతనికి జై కొట్టారు. వీటన్నింటి వల్ల రాహుల్‌కు గెలుపు ఖాయమైంది. ఒక్కసారి కూడా కెప్టెన్‌ అవని రాహుల్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat