ఇసుక పై తన నిరసన చేయడానికి విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ వివాదాస్పదమవుతోంది. లాంగ్ మార్చ్ అని చెప్పి కారులో నిలబడి రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన పలు చేష్టలు విమర్శలకు తావిస్తోంది. తనకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకుని వారి సమస్యల కోసం తాను ఎంతవరకైనా పోరాడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఒక చేతితో పారా మరో చేతితో గంప పెట్టుకుని భవన నిర్మాణ కార్మికుల నిరసన తెలియజేశారు. అయితే రాష్ట్రంలో గానీ దేశంలోనే ఎక్కడా ఎవరూ పనిచేసిన ఎట్టిపరిస్థితుల్లోనూ గంపను ఉపయోగించరు కేవలం గమేలా మాత్రమే వాడతారు. ఇది చూసిన అందరూ పవన్ విమర్శిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు ఏ పర్మిట్లతో పని చేసుకుంటారో తెలియని పవన్ కళ్యాణ్ కు వారి సమస్యలు ఏం తెలుసంటూ విమర్శిస్తున్నారు.
