ప్రస్తుతం దేశ రాజధానిగా ఢిల్లీ మహానగరం వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. డా. బీఆర్ అంబేద్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో హోం శాఖ సహాయ మంత్రిగా.. గవర్నర్ గా చేసిన విద్యాసాగర్ రావు ఇలా వ్యాఖ్యనించడం రాజకీయ వర్గల్లో చర్చనీయాంశంగా మారింది.
