సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సరికొత్త లోగోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న లోగోను ఫేస్ బుక్ మార్చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ తో FACEBOOK లోగోను నూతనంగా క్రియేట్ చేసింది.
అయితే ఈ లోగోను కేవలం కంపెనీ అంతర్గత కార్యకలాపాల్లో మాత్రమే వినియోగిస్తాము. మిగిలినవాటి కోసం ఫేస్ బుక్ కు సంబంధించిన పాతలోగోనే ఉంటుంది అని కంపెనీ తెలిపింది.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఈ లోగోను క్రియేట్ చేయడానికి మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలా అని వెటకార కామెంట్లు చేస్తున్నారు.