జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. చంద్రబాబుకు జీవితాంతం తన కాల్షీట్లు రాసి ఇచ్చిన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నం లో పవన్ కళ్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదని రాంగ్ మార్చ్ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కారులో కనీసం ఒక్క అడుగన్న నడుస్తారు అనుకున్నానని కానీ తాను చాలా సేఫ్టీ గా కార్లో వెళ్లి పోయారు కానీ నడిచింది మాత్రం జనసైనికులు ఇప్పటికైనా అతని స్వభావం అర్థం చేసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడరన్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేస్తే for 16 సీట్లు వచ్చాయని కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం ఒక్క సీటు మాత్రమే వచ్చిందని ఇది అతని స్టామినా ఎప్పటికైనా తన స్థాయి ఏంటో తాను తెలుసుకోవాలన్నారు.
