తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లా మొదటినుంచీ కంచుకోటగా ఉంది కృష్ణాజిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఉండడం పట్ల ఆ పార్టీ తరఫున ఎవరు నిలబడిన గెలుస్తారు అనేది ఉండేది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అలాగే విజయవాడ లో యువతకు తలలో నాలుకగా ఉండే దేవినేని అవినాష్ కూడా వైసీపీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పునాదులు కదిలిపోయాయి అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి పార్టీలో ఉన్న బుద్ధ వెంకన్న, దేవినేని ఉమా ఉమామహేశ్వరరావు, బోండా ఉమ వీరి వల్ల ఏమాత్రం పార్టీకి ఉపయోగం లేదు. పైగా వారికి వ్యక్తిగతంగా క్యాడర్ పెద్దగా లేదు. బొండా ఉమా కు ఉన్న కొద్ది మంది అనుచరులకే అతనిపై ఉన్న భూకబ్జా కేసులో రౌడీషీటర్ ఆరోపణలతో నిరుపయోగంగా మారింది. ఇప్పటికే జిల్లా మొత్తం నడిబొడ్డున చేరికతో వైసీపీ పెద్ద ఎత్తున పుంజుకుంటుంది.
