ఇసుక విషయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ వేదికగా ఆరు గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. అయితే ఈ నిరాహార దీక్షలో ఎప్పుడు అనుసరించే పద్ధతినే టీడీపీ ఆరంభించింది. భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున రావాలంటూ స్వయంగా చంద్రబాబు విజ్ఞప్తి చేసినా ఎక్కువ సంఖ్యలో హాజరు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దీక్ష ప్రాంగణాన్ని నింపారు. అదే విధంగా గతంలో శేఖర్ చౌదరి, నకిలీ పోలీసులు, నకిలీ రైతుల వేషాలులాగే భవన నిర్మాణ కార్మికులను తీసుకొచ్చారు. విచిత్రం ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాటలు పెట్టినప్పుడు సదరు ఆర్టిస్టులు డాన్సులు వేయడంతో అక్కడున్న నాయకులు చాలామంది అవాక్కయ్యారు. భవన నిర్మాణ కార్మికులు నిజంగా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉంటే వీళ్ళు ఇక్కడ టిడిపి పాటలకు డాన్స్ లు వేస్తున్నారు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
