వరుస విజయాలతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి… గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టి తెలుగులో సినిమావకాశాలను కోల్పోయిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . అయితే ఈ ముద్దుగుమ్మ లండన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్ తో ప్రేమాయణం నడిపిన సంగతి విదితమే.
అయితే వీరిద్ధరి మధ్య ప్రేమ బ్రేకప్ అయిందనే వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి కూడా తెల్సిందే. అయితే తమ ప్రేమ పై వస్తోన్న వార్తలపై ఈ ముద్దుగుమ్మ స్పందించింది. ఈ సందర్భంగా ఇలియానా ” రిలేషన్ అనే ఇద్దరి మధ్య ఉంటుంది. ఈ విషయం ఇద్దరి వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయం. దీనిపై ఎవరు మాట్లాడకూడదు.
అయితే నేను ఉన్నంత కమిట్మెంట్ తో ఎదుటివ్యక్తి ఉండాల్సిన అవసరం లేదనుకున్నాడు. సోషల్ మీడియాలో నాపై వస్తోన్న ట్రోల్ ను నేను పట్టించుకోను.లవ్ లో బ్రేకప్ అయినందుకు నాకు ఎలాంటి బాధలేదు. ఈ విషయంలో నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు”అని పరోక్షంగా తన లవ్ బ్రేకప్ అయింది అని తేల్చేసింది.