తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రధాన కార్యదర్శి,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రశాంతి కమిషన్ కార్యాలయం ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం కమిషనర్ ప్రశాంతి మరో ముగ్గురు అంటే వీహాబ్ సీఈఓ దీప్తి రావుల,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రవికిరణ్ ,మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ గార్లకు విసిరారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రశాంతి మాట్లాడుతూ” ప్రస్తుతం రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలి. నాటిన మొక్కలనుని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని’ తెలిపారు.
Thank you @MC_Sangareddy garu for accepting #GreenIndiaChallenge and planting saplings. #HaraHaiTohBharaHai ??. https://t.co/UzYn7KUuHr
— Santosh Kumar J (@MPsantoshtrs) November 16, 2019