Home / SLIDER / జియో వినియోగదారులకు షాక్

జియో వినియోగదారులకు షాక్

మీరు జియో వాడుతున్నారా..?. డేటా దగ్గర నుంచి కాల్స్ వరకు అదే నెట్ వర్క్ వాడుతున్నారా..?. అయితే ఇది తప్పకుండా మీకోసమే. త్వరలోనే మొబైల్ సేవల ధరలను పెంచనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ ప్రకటించింది.

ఇందులో భాగంగా ప్రస్తుతమున్న వాటిని మార్చి వేసి కాల్స్ ,డేటా చార్జీలను త్వరలోనే పెంచి తీరుతామని ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఎంత మొత్తంలో ధరలను పెంచుతారో మాత్రం జియో స్పష్టత ఇవ్వలేదు.

ఇటీవల వోడాఫోన్ -ఐడీయా,భారతీ ఎయిర్టెల్ చార్జీలను పెంచుతామని ఆ సంస్థల ప్రకటించిన తర్వాత తాజాగా జియో ఆ దిశగా అడుగులేయడం విశేషం . అయితే ఇప్పటికే జియో జియో నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్కులకు వెళ్ళే కాల్స్ పై నిమిషానికి ఆరు పైసలు చొప్పున వసూలు చేస్తున్న జియో తాజా ప్రకటనతో ఎంతమొత్తంలో పెంచనున్నదో అని వినియోగదారుల్లో తీవ్ర ఆసక్తి నెలకొన్నది.