హాస్య చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి.. మొదటిసారి రూటు మార్చి థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు . శ్రీనివాసరెడ్డి చాలా కష్టపడి టాలెంట్‌తో పైకి వచ్చిన డైరెక్టర్ అనేది ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. తాజాగా ‘రాగాల 24 గంటల్లో’ అనే సినిమా తీశాడు. సత్యదేవ్, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్) ప్రధానపాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ.. ‘రాగల 24 గంటల్లో’.. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్స్‌లో కనిపించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఈషా రెబ్బా ఈ సినిమాలో కూడా తన మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఇకపోతే సెంకండాఫ్ నుంచి ఇంట్రెస్ట్ పెంచాడు డైరెక్టర్ . రాగల 24 గంటలలో ఏం జరగబోతుంది అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా టైటిల్‌కి తగ్గట్టే ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడంలో సక్సెస్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.
