తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని క్యాబినేట్ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున గురువారం మధ్యాహ్నాం రెండు గంటలకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో భేటీ కానున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై.. ఆర్టీసీ సిబ్బంది సమ్మె విరమించిన నేపథ్యంలో ఆర్టీసీ సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలా..?. వద్దా..?. ఆర్టీసీ ప్రైవేటీకరణ,కొత్త రెవిన్యూ యాక్టు తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు అని తెలుస్తుంది.