జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో పవన్ ముఖ్య అతిధిగా పాల్గొని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ” తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. ఇండస్ట్రీ కూడా దిగజారుతుంది. చాలా మంది తెలుగు సినిమా హీరోలకు తెలుగు మాట్లాడటం రాదు.. చదవడం రాదు అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల ద్వారా డబ్బులు అవసరం. కానీ తెలుగు నేర్చుకోవాలని చాలా మంది హీరోలకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. కార్యకర్తలే నా బలం అని మరోసారి ఉద్ఘాటించారు.