ఇప్పటి వరకు యాక్షన్ చిత్రాలలో నటించలేని త్రిష మొదటిసారిగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న యాక్షన్ చిత్రమైన తమిళ ‘రాంగీ’ లో నటించనున్నారు. ఎం.శరవణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.మురుగదాస్ కథను అందించారు. లైకా ప్రొడెక్షన్స్ బ్యానర్‌పై శుభకరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష చేసిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.గతేడాది విడుదలైన ‘96’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు నటి త్రిష. ఇందులో విజయ్ సేతుపతికి జంటగా ఆమె కనిపించారు. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం సినీ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత రజనీకాంత్ సరసన ‘పేట’ సినిమాలో నటించారు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. తమిళ రాంగి చిత్రాన్ని జనవరి లో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు.
