ముఖ్యంగా ఈ గ్రామ సచివాలయాలు ఈ రాష్ట్రంలో రావడానికి గత ఐధు సంవత్సరాల్లో జన్మభూమి కమిటీల పేరుతో ఏవైతే అక్రమాలు జరిగాయో, ఏవైతే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్రమ సంపాదనకు ఉపయోగపడ్డాయో మనం చూశాం. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాళ్ల పార్టీకి సంబంధించిన వ్యక్తులకే అన్ని సంక్షేమ పధకాలు కట్టబెట్టారు. అలా జరగకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, కులం, మతం, పార్టీల వంటి వివక్ష లేకుండా అర్హతే ప్రమాణంగా పేదలరందరికీ సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రిగారు తీసుకున్న గొప్ప నిర్ణయమిది.గ్రామ సచివాలయాల్లో ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలు వంటి సంక్షేమ పథకాలు అందాలంటే , ఇవన్నీ æ పారదర్శకంగా అమలు కావాలంటే గ్రామ సచివాలయాలు అవసరమనే భావనతో వీటిని ప్రారంభించాం.
ప్రతీ గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించిన వాలంటీర్లు, పారదర్శకంగా జరిపిన పరీక్షల్లో పాసైన గ్రామ సెక్రటరీలు, వీళ్లందరూ కూడా అక్క డ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా పారదర్శంగా నవరత్నాలతో పాటు మేనిఫెస్టోలో పొందురపరిచిన అంశాలన్నీ పారదర్శంగా అర్హులైన వారందిరికీ అందేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సచివాలయ ఏర్పాటుకు రెండువేల జనాభా ప్రాతిపదినక ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాలో రెండువేల జనాభా కనా తక్కువ ఉన్నా అక్కడి భౌగోలిక పరిస్ధితిలును బట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రణాళిక« ఆధారంగా 11158 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. 3786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. 14944 సచివాలయాలు రాష్ట్ర మొత్తం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ గ్రామ సచివాలయంలో అన్ని శాఖలకు సంబంధించి 12 నుంచి 14 దాకా విలేజీ సెక్రటేరియట్ సిబ్బంది ఉంటారు. 14 శాఖలకు సంబంధించిన సెక్రటరీలు ఉంటారు. వారు ప్రజలకు కావాల్సిన అన్ని పనులు చూస్తారు.
నియామకాల విషయం చూస్తే 11158 గ్రామ సచివాలయాల్లో 95088 పోస్టులు, 3786 వార్డు సచివాలయాలకు సంబంధించి 31680 పోస్టులు మొత్తం 126728 గ్రామ, వార్డు సెక్రటేరియట్ పోస్టులను మంజూరు చేయడం జరిగింది. వీళ్లందరూ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు. మొదటి రెండు సంవత్సరాల కాలాన్ని ప్రోహిబిషన్ కాలంగా నిర్ణయించి రూ.15వేలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించబడారు. ఈ ప్రక్రియ కోసం 26 జూలై 2019 నోటిఫికేషన్ ఇచ్చాం. సెప్టంబరు 1 నుంచి సెప్టంబరు 8 వరకు పరీక్షలు జరిగాయి. దాదాపు 21.69 లక్షల మంది ఈ పరీక్షలకు నమోదు చేసుకున్నారు. 19.50 లక్షల మంది అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యారు. 04–12–2019 నాటికి నోటిఫై చేసిన మొత్తం 1,26,728 పోస్టులకు గాను 1,21,318 మంది అభ్యర్ధులకు నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో 1,01,346 మంది అభ్యర్ధులు విధులకు హాజరయ్యారు. కొంతమంది రెండు, మూడు పోస్టుల్లో ఎంపికైనవారున్నారు. వారి సంఖ్య 12,704 మంది. నెల రోజులు టైం ఇస్తాం. అట్లాంటి వారిలో 7269 మందికి ఆపాయింట్‌మెంట్లు ఇచ్చాం. ఇంకా 16,581 ఖాలీలున్నాయి.
గ్రామ సచివాలయంయొక్క సేవలు చేస్తూ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కానీ, నవరత్నాలు అమలులో వీరు చాలా క్రీయాశీలకంగా ఉంటారు. వీరికి శాఖాపరమైన శిక్షణ కోసం రూ. 60.12 కోట్లు విడుదల చేశాం. ఇప్పటి 49737 మంది అభ్యర్ధులు ఇండక్షన్స్ పూర్తి చేశారు. శాఖపరమైన శిక్షణ జాబ్‌చార్ట్ సక్రమంగా అమలు చేయడం కోసం సేవలు సమర్ధవంతంగా అందిచడానికి పంచాయితీ రాజ్ ఇస్తున్న శిక్షణ కోసం బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తి మరియు సంబంధిత శాఖలకు సంబంధించిన శిక్షణా సంస్ధల్లో నిర్ధిష్టమైన శిక్షణ ఇవ్వడం జరిగింది.
మౌలిక సదుపాయాల విషయానికొస్తే 1,11,158 సచివాలయాలకు గాను 4670 సెక్రటేరియట్‌లకు కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. 3780 సెక్రటేరియట్‌లకు ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఫర్నీచర్ కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసింది. వీటితో కుర్చీలు టేబుళ్లు, బీరువాలు వంటివి కొనుగోలు చేస్తున్నాం. సంబంధిత డీసీసీల ద్వారా టెండర్లు పిలిచి డిసెంబరు 31 నాటికి కొనుగోళ్లు పూర్తి చేస్తాం. అదే విధంగా డెస్క్‌టాప్‌లు, యూపీఎస్‌లు, లామినేటింగ్ మిషన్లు , 4జి సిమ్ కార్డులు, స్మార్ట్ ఫోన్స్, ఫింగర్ ఫ్రింటర్లు, స్కానర్లు ఏపిటిఎస్ తో∙చేస్తాం. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. సిబ్బంది పనితీరు ట్రాకింగ్ వ్యవస్ధ ద్వారా వారిని పరిశీలన చేస్తాం. ఆశించిన ఫలితాలు, అవాంతరాలు లేని సేవలు అందిస్తారు. ప్రతిరోజు స్పందన కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించి సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శుల సహకారంతో సమస్యలను 72 గంటల్లోగా ప్రాధాన్యతతో పరిష్కరించడం జరుగుతుంది. అదే విధంగా సెక్రటేరియట్‌కు 1,26,728 మంది, వాలంటీర్లు 2,65,989 మంది లైన్‌మెన్లు 7989 మంది మొత్తం 4,00,706 ఉద్యోగాలు దేశచరిత్రలో ఇన్ని ఉద్యోగాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.
ఇదో చరిత్రాత్మకం, మరే రాష్ట్రంలో ఇలా జరగలేదు. మన రాష్ట్రంలో మునుపెన్నడూ ఇలా జరగలేదు. బాబొస్తే జాబొస్తుందన్నాడు కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు, అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది ఉద్యోగాలిచ్చారు. చక్కగా పరీక్షలు నిర్వహించి, ఇంత చక్కగా చేయడంతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించారు. ఎస్‌సీఈఆర్‌టికి ఈ పరీక్షలు నిర్వహణ ఇచ్చాం. జనరల్ నాలñ డ్జి, మహిళా పోలీస్, వెల్ఫర్ అండ్ ఎడ్యుకేషన్ పేపర్, విలేజీ సెక్రటరీ పేపరు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పేరు, ఈ ఐదు పరీక్షలు ఎస్‌సీఈఆర్‌టి నిర్వహించింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్,డీజిల్ అసిస్టెంట్ అనంతపురం జేఎన్‌టియూ వాళ్లు నిర్వహించారు. వార్డు సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంటు వారే స్వయంగా చూశారు. అగ్రికల్చర్, హార్ట్ కల్చర్, సిరికల్చర్, ఆనిమల్ హజ్బెండరీ, ఫిషరీస్, ఏఎన్‌ఎం పరీక్షలు సంబధిత శాఖలు నిర్వహించారు. సర్వేయరు, వీఆర్వో పరీక్షలు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ చూసింది. ఈ శాఖలన్నీ కూడా మూడు సెట్ల పేపర్లు ఏపీపబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇవ్వడం జరిగింది. వాళ్లు ప్రశ్నాపత్రాలను ముద్రించి వాటిని అత్యంత భద్రతతో జిల్లాలకు పంపించడం జరిగింది.
పరీక్షలు జరిగిన తర్వాత పేపర్లు అన్నీ కూడా నాగార్జున యూనివర్సిటీకి పంపించడం జరిగింది. అక్కడ స్కానింగ్ సెంటర్ ఉంది. అక్కడ డేటా టెక్ మెథాడిక్ సోల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఇవాల్యువేట్ చేసారు. తర్వాత కూడా నిపుణులతో పది కాపీలు చొప్పున రేండమ్‌గా తనిఖీ చేయించాం. పరీక్షలు అయిపోయిన తర్వాత ఆంధ్రజ్యోతితో సహా అందరూ సచివాలయ పరీక్షలు ప్రశాంతం అని రాశారు. ఈనాడు కూడా అర్హులు 1.98 లక్షలు చరిత్రలో తొలిసారి అని రాశారు. రెండో రోజే ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు కనుసన్నల్లో నడిచే పత్రికలు… 19వ తేదీన ఫలితాలు విడుదల చేస్తే ఆంధ్రజ్యోతి విలేఖరి ఏపీపీఎస్సీ ఛైర్మన్ దగ్గరికి పోయి మాట్లాడటం జరిగింది. అనితమ్మ అనే ఆమె కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న ఆమెతో మాట్లాడి మరుసటి రోజు పరీక్షల పేపర్ లీక్ అయిందని రాశారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పేపర్ లీక్ అయిందని రాశారు. అయినా మేం దీనిపై మరోసారి సమావేశమయ్యాం. విజిలెన్స్ విచారణ చేసిన తర్వాత లీక్ లేదని తేలింది. లీకేజీ పై తర్వాత మాట్లాడుతా అని ఛైర్మన్ మాట్లాడారు, పేపర్ లీకైంది లేదో తెలియదు, పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీకు సంబంధం లేదు, పంచాయితీరాజ్ శాఖనే అడగండి అని అనుమానం వచ్చేలా మాట్లాడారు. ఛైర్మన్ గారే స్వయంగా మాట్లాడారు కాబట్టి ఎవరైనా అనుమానపడతారన్నారు.