ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ,ఏపీటీఎస్ ప్రాజెక్టుల్లో విజయవంతమవుతుంది.
ఈ దిశగా మరోసారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. నెల్లూరు జిల్లా ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండరింగ్ లో ఎనిమిది కంపెనీలు పాల్గొన్నాయి.
రూ.253.7కోట్ల ప్రాజెక్టును హైదరాబాద్ కు చెందిన బీవీఎస్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కేవలం రూ.185.6కోట్లకు కోట్ చేసి బిడ్ దక్కించుకుంది.
దీంతో ప్రభుత్వానికి రూ.67.81కోట్ల ఆదాయం ఆదా అయింది.