తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల నిర్మల గోపాల్ ,వార్డు సభ్యులు ఉమా మహేశ్వరి,విద్యాసాగర్,గౌడ సంఘం నేతలతో పాటు వందమంది కార్యకర్తలు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ వీరందరికీ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ”టీఆర్ఎస్ పార్టీలో చేరేవారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తాము. జిల్లా లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని”అన్నారు