ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత నేత పరిటాల రవి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరాములయ్య సోదరుడు పరిటాల గజ్జిలప్ప అనారోగ్యంతో అకాల మృతి నొందారు. ఆయన గత కొన్ని రోజులుగా
అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ఆయన మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర కన్నీరుమున్నీరవుతున్నారు. గజ్జిలప్ప ఇక లేరని తెలుసుకున్న జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. రేపు సోమవారం మధ్యాహ్నాం పరిటాల గజ్జిలప్ప అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.