యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ ఎత్తున ఈయన ఫాలోయింగ్‌ను కలిగి ఉన్నాడు.అద్బుతమైన నటన మరియు మంచి మనసున్న వ్యక్తిగా ఎన్టీఆర్‌ను అంతా కూడా అభిమానిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ ను అభిమానించే వారిలో సెలబ్రిటీలు కూడా చాలా మంది ఉన్నారు. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తమ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన స్టార్ హీరోయిన్ ఖుష్బూ తనకు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంను మరో సారి చెప్పింది. ఆటీవీ లో కమెడియన్ అలీ హోస్ట్ చేస్తున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి సంబంధించి వచ్చే వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఈవారం అతిథిగా హీరోయిన్ ఖుష్బూ వచ్చారు. ఖుష్భూ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఈ ప్రోమోలో తెలుస్తుంది. ఎన్టీఆర్ ఫోటో రాగానే ముద్దులు మీద ముద్దులు పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది.
