Home / MOVIES / కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్

కళ్యాణ్ రామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే వరుస విజయాలతో.. వరుస మూవీలతో ఇండస్ట్రీలో తనదైన రేంజ్ లో దూసుకుపోతున్నాడు. మరోవైపు తన సోదరుడైన ఒక పక్క నిర్మాతగా.. మరో పక్క హీరోగా సినిమాలను చేస్తూ తన స్టార్ డం ను నిలబెట్టుకుంటున్నాడు.

ఈ క్ర్తమంలో ఈ సంక్రాంతికి బాక్సాపీస్ దగ్గర నాలుగు మూవీలు పోటీ పడుతున్నాయి. వీటిలో జనవరి తొమ్మిదో తారీఖున దర్బార్ విడుదల కానున్నది. పదకొండు తారీఖున సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ రానున్నది. పన్నెండు తారీఖున అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో రీలీజ్ అవుతుంది.

ఆ తర్వాత పదిహేను తారీఖున ఎంత మంచివాడవురాల తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.అయితే ఎంత మంచివాడవురాల మూవీ తప్పా మిగతావన్నీ స్టార్ హీరోలు నటించేవి. ఇది ఒక్కటే చిన్న మూవీ. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచడం కోసం అన్న కోసం సోదరుడు ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు. జనవరి ఎనిమిదో తారీఖున జేఆర్సీ కన్వెషన్ సెంటర్లో ఈ మూవీ ఫ్రీ రీలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నాడు. ఎన్టీఆర్ రాకతో ఈ మూవీపై హైప్ పెరుగుతుంది.