జనసేన అధినేత,సీని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ స్టార్ హీరో. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డె హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో..
ఈ మూవీ యొక్క మ్యూజికల్ నైట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ ఫ్యాన్స్ ను హార్ట్ చేశాడు. మ్యూజికల్ నైట్లో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతున్నప్పుడు పవన్ ఫ్యాన్స్ పవన్ పవన్ అని గట్టిగా అరిచారు.
దీంతో సరే మీకోసం పవన్ అంటానని అసహానం వ్యక్తం చేశాడు. నాకు చిరంజీవి అంటే ప్రాణం.. కట్టే కాలే వరకూ ఆయన అభిమానినే.. చిరు తర్వాత రజినీ అంటే చాలా ఇష్టం అని అన్నాడు.. దీంతో బన్నీ కావాలనే పవన్ వ్యంగ్యంగా స్పందించాడని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.