ఢిల్లీ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్లో జరిగే బయో ఆసియా సదస్సుకు హాజరుకావల్సిందిగా పీయూష్ గోయల్‌ని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. వరంగల్, హైదరాబాద్ కారిడార్‌లను వేర్వేరుగా కారిడార్‌లుగా మంజూరు చేయాలని కోరారు.
హైదరాబాద్-బెంగళూరు-చెన్నై మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుచేయాలని కోరారు. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రై పోర్టుతో పాటు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులకు మద్దతివ్వాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ పార్మాక్లస్టర్, ఫార్మాసిటీ జహీరాబాద్ నిమ్జ్ గురించి వివరాలు పీయూష్ గోయల్ అడిగి తెలుసుకున్నారు.
Met with Hon’ble Industry & Commerce Minister Sri @PiyushGoyal Ji
Requested for new industrial corridors between HYD- Nagpur, HYD – Warangal & a southern industrial corridor covering 4 states from HYD – Bengaluru- Chennai
Also sought support for setting up a Dry Port in TS pic.twitter.com/smwYy98F9J
— KTR (@KTRTRS) January 10, 2020