యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం సాహో. ఈ చిత్రం అంతగా ఆడనప్పటికీ కలెక్షన్లు పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించింది. అయితే ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న సమయంలోనే ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా తీస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే. దీనికి జాన్ అని టైటిల్ కూడా అనుకున్నారని ఈ మేరకు దానికి సంబంధించి ఎలాంటి విషయం రిలీజ్ అయిన జాన్ అని హ్యాస్ ట్యాగ్ కూడా పెట్టడంతో ఫ్యాన్స్ ఆ టైటిల్ కు ఫిక్స్ అయ్యారు. కాని ప్రభాస్ కి సడన్ షాక్ తగిలిగింది శర్వానంద్ రూపంలో. 96 సినిమా రీమేక్ గా శర్వానంద్, సమంత జంటగా తెలుగులో రానుంది. అయితే దీనికి జాను అని టైటిల్ పెట్టారు. దాంతో ఇప్పుడు ప్రభాస్ సినిమాకు టైటిల్ కచ్చితంగా మార్చాల్సిందే.
