రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. టీఆర్ఎస్ అభ్యర్థులకు శ్రీరామరక్షా అని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని చూసి ఓటు వేయాలని ప్రజలకు మంత్రి ఈటెల పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలవలేరని, ఒకరో ఇద్దరో గెలిస్తే వారు అభివృద్ధి చేయలేరని చెప్పారు. పదవులు ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేవని, ఆ పదవిని ప్రజల సేవ కోసం నేతలు ఉపయోగించాలన్నారు. ప్రజలు మెచ్చే పద్ధతిలో నాయకుల పని విధానం ఉండాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రభుత్వానికి అండగా ఉండాలని మంత్రి కోరారు. హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలను అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ పార్టీ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
