ప్రగతి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికి బాగా తెలిసిన వ్యక్తి. ఈమె తెలుగులో అమ్మ, చెల్లి, అక్క, భార్య ఇలా అన్నింటిలో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రగతి మొదట తమిళ్ లో హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత పెళ్ళైన మూడేళ్ళ తరువాత సీరియల్స్ తో ప్రారంభించి చివరికి టాలీవుడ్ లో నిలదొక్కుకుంది. తన నటనతో అందరిని ఆకట్టుకుని మంచి పేరు తెచ్చుకుంది. అయితే అసలు విషయానికి వస్తే ప్రగతి సినిమాల్లో అమ్మ పాత్రలో కనిపించినా బయట మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది అని తన లేటెస్ట్ పిక్ చూడగానే అర్దమైంది. ఇందులో రెడ్ కలర్ సారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని చేతిమీద టాటు వేసుకొని ఉన్న పిక్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.