అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. వరుస సినిమాలతో… వరుస విజయాలతో తనకంటూ ఒక ఫ్లాట్ ఫాం సంపాదించుకున్న యువహీరో రాజ్ తరుణ్ . ఆ తర్వాత కాస్త గ్యాప్ వచ్చిన కానీ తాను నటించిన సినిమాలు విజయాలు సాధించడంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ఈ యంగ్ హీరో.
ప్రస్తుతం రాజ్ తరుణ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కె.కె రాధామోహాన్ నిర్మాతగా పూర్తిగా ఎంటర్ ట్రైన్మెంట్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా లో హీరోగా నటిస్తున్నాడు. మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
హెబ్బా పటేల్,వాణీ విశ్వనాథ్ ,నరేష్,పోసాని కృష్ణమురళి ,సప్తగిరి,రాజా రవీంద్ర ,అన్నపూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ అదిరిపోయింది. మీరు ఒక లుక్ వేయండి.