వినడానికి వింతగా.. ఆశ్చర్యంగా ఉన్న కానీ ఇదే నిజం. సహాజంగా ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అని అంటుంటాము కదా.. నిజంగా ఈ కుక్కకు అలాంటి రోజే వచ్చింది.
ఏపీలో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన రూపొందించిన ఓటర్ల జాబితాలో ఒక ఓటరు కార్డులో కుక్క ఫోటో దర్శనమివ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.
అటు మరో వ్యక్తి పేరు మీద ఏకంగా ఎనిమిది ఓట్లు రావడం గమనార్హం. యాబై డివిజన్లలో ఏడు విలీన మండలాలను కలిపి రూపొందించిన ఈ ఓటరు జాబితా తప్పులతడకగా ఉంది. దీంతో సరిచేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తోన్నారు.