Home / SLIDER / ఐటీ హాబ్ దిశగా వరంగల్

ఐటీ హాబ్ దిశగా వరంగల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో .. రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ఐటీ హాబ్ దిశగా అభివృద్ధి చెందుతుంది అని ఆ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

వరంగల్ ను ఐటీ హాబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తూ.. తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్‌ను ఐటీరంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే యజ్ఞంలో ఒక్కో కంపెనీ భాగస్వామ్యం అవుతున్నాయి.

ఇందులో భాగంగానే సైయంట్‌, టెక్‌ మహీం ద్రా కంపెనీలు తమ కార్యకలాపాలు సాగిస్తుండగా మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ కూడా వరంగల్‌లో సంస్థ ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించడం సంతోషంగా ఉన్నదని ఆయన అన్నారు. తాజాగా మొత్తం 1.5 ఎకరాల్లో క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్థాపించి.. సుమారు 500 మందికి ఉపాధి కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తంచేశారు. కంపెనీ సీఈవో వంశీరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.