ప్రముఖ తెలుగు సినీ నటుడు.. తెలుగు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ పై దాడి జరిగినట్లు ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర కారులో వెళ్తున్న కత్తి మహేష్ పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు.
కారును ఆపి కారద్దాలను పగులకొట్టారు.దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కత్తి మహేష్ సోషల్ మీడియా వేదికగా హిందుత్వం,రామాయణం పై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయనపై కొన్ని చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి.