తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ”మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని” ఆయన స్పష్టం చేశారు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయిలో కరోనా సోకింది. ఆ వ్యక్తి రెండు రోజుల్లో డిశ్చార్జి కావొచ్చు అని మంత్రి పేర్కొన్నారు. మైండ్‌స్పేస్ ఉద్యోగికి కరోనా నెగిటివ్ వచ్చిందన్నారు.
కరోనాపై అతిగా స్పందించొద్దు అని సూచించారు. కరోనా వచ్చిందంటూ ఒక సాఫ్ట్‌వేర్ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఐటీ కంపెనీలు బాధ్యతతో వ్యవహరించాలి అని మంత్రి చెప్పారు.పూణే కి పంపించిన ఇద్దరు వ్యక్తుల రిపోర్టుల్లో కరోనా వైరస్ లేదని తేలిందని అన్నారు.