అనుపమ పరమేశ్వరన్..తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తుంది. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో శతమానం భవతి చిత్రంలో నిత్య పాత్రతో ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. అప్పటినుండి సినిమాల్లో తన స్పీడ్ పెంచింది. మరోపక్క సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. రోజు మంచి పిక్స్ తన ఇంస్టా అకౌంట్ లో పెట్టి ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. ఇప్పుడు తాజాగా సముద్ర తీరంలో ఉన్న ఒక పిక్ పెట్టింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.