Home / EDITORIAL / విలయంలోనూ విజయమే.

విలయంలోనూ విజయమే.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నేలలు కరువు రక్కసితో తండ్లాడినయ్..చుక్క నీరు దొరక్క రైతు మబ్బుమొకాన చూసిండు..కరువు విలయతాండవం చేస్తున్న వేల ఉరికొయ్యన వేలాడిండు..ఒక్క పంట పండితే చాలనుకున్నడు..యాసంగి పై ఆలోచన కూడా లేకుండే..కానీ నేడు స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.దరిద్రంలో బ్రతికిన రైతు దాన్య రాశులను పండించిండు.ఒక్కపంట పండితే అదే పదివేలు అనుకున్న చోట బంగారు యాసంగి పంటతో పసిడి సిరులు కురిపించిండు.ఉరికొయ్యలు పోయి గుమ్మి నిండా దాన్యంతో రైతు మోము చిరునవ్వులతో వికసించింది.నేడు దేశానికే తెలంగాణా అన్నంపెట్టే స్థాయికి ఎదిగింది.ఇది తెలంగాణా ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత,ముందుచూపు తో చేపట్టిన చర్యలకు దక్కిన ఫలితం..తెలంగాణా రైతాంగం సాదించిన అద్బుత విజయం..

సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకు నీళ్ళు లేక ఒక్క పంటతోనే రైతులు అష్టకష్టాలు పడేది.రెండో పంట వేస్తే నీళ్ళు రాక తీవ్రంగా నష్టపోయేది. కానీ తెలంగాణా ఏర్పాటు,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో మిషన్ కాకతీయతో 40 వేల చెరువుల పుణరుద్దరణ తద్వారా నీటి నిల్వ సామర్ధ్యం పెరగటం,వేగంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్,పాలమూరు,సీతారామ ఇలా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం తెలంగాణా సాగునీటి రంగానికి ప్రదమ ప్రాదాన్యం ఇస్తూ చర్యలు చేపట్టడంతో అందుకు అనుగుణంగా ఊహించని ఫలితాలు తెలంగాణా రైతాంగం సాదించింది.మొదటి పంటే కష్టం అనుకున్న చోట తెలంగాణా నేడు రెండో పంటకు రికార్డు స్థాయిలో దాన్యసిరులు పండటం తెలంగాణాకు గర్వకారణంగా చెప్పవచ్చు..

ఒకప్పుడు తెలంగాణా లో దాన్యం పండదని,అలాంటప్పుడు వాళ్ళకు నీళ్ళెందుకని ఎగతాళీ చేసారు.తెలంగాణా వస్తే మొత్తం చీకట్లు అవుతాయని హేళన చేసారు..కానీ ఆ మాటలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలన దక్షత,సంకల్పంతో రికార్టు వేగంతో ప్రాజెక్ట్ లు పూర్తవడం,చెరువులకు నీళ్ళు తరలించుకోవటం,ఎస్సారెస్సీ,ఇతర కాలువల్లో ఎన్నడూ లేని విదంగా జల ప్రవాహం నిరంతరం కొనసాగుతుండటం,కోతలు లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందుతుండటం,రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరాకు 10 వేల రూపాయలను రైతు బందు పేరుతో ముఖ్యమంత్రి గారు అందజేస్తుండటంతో రైతులు దైర్యంగా రికార్డ్ స్థాయిలో వరిని సాగుచేసారు.అందుకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయి..ఈ ఏడాది యాసంగిలో 50 లక్షల టన్నుల దాన్యం వచ్చే అవకాశం ఉంది..అంటే సమైక్య రాష్ట్రంతో పోల్చుకుంటే ఇది 100 రెట్లు అధికం.ఇది ఒక రికార్డు..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుచూపుతో చేపట్టిన పనులు అద్బుత ఫలితాలనిస్తున్నాయనడానికి ఇదో నిదర్శనం.

సమైక్య రాష్ట్రంలో కాలువలు తవ్వి నీళ్ళివ్వడం మరిచారు.కానీ తెలంగాణా ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్సారెస్పీ పుణర్జీవ పేరుతో కాలువలను శుభ్రం చేసి నీరు వదిలారు..దాదాపు ఎస్సారెస్పీ లో రెండు నుండి మూడు నెలలుగా జీవంతో జలం నిరంతరాయంగా పారుతూనే ఉంది..దేశమే అబ్బురపడేలా మూడేళ్ళలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసారు..అవసరం ఉన్నప్పుడల్లా నీళ్ళను ఎత్తిపోస్తున్నారు,ఎన్నడూ లేని విదంగా గోదావరిని ఎదురెక్కించి నిరంతరం నీళ్ళను జీవంగా ఉంచగలిగారు.. ఎక్కడా పంటలు ఎండకుండా జాగ్రత్త పడి నేడు యాసంగిలో 50లక్షల టన్నుల దాన్యం దిగుబడికి ముఖ్యమంత్రి గారు కృషి చేసారు..లెక్కకు మించిన దిగుబడులతో తెలంగాణా దేశానికి ”రైస్ బౌల్ ఆఫ్ ఇండియా” గా నిలిచింది..ఇతర రాష్ట్రాల నుండి మనం దాన్యం దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఇతర రాష్ట్రాలకు మనం ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణా నిలిచింది..

ఐదేళ్ళపాటు సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రాదాన్యత తెలంగాణాకు ఇంతటి గొప్ప ఫలితాన్ని అందజేసింది.. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కదిలిస్తుండటంతో దేశం,తెలంగాణా దాని నివారణ చర్యల్లో తలమునకలైంది..ఇంత క్షిష్టపరిస్థితుల్లో రైతులు పండించిన పంట ఆగం కావద్దని నేరుగా ఊర్లలోకి వెల్లి ప్రభుత్వమే మద్దతు దర చెల్లించి దాన్యం కొనుగోలు చేసే విదంగా చర్యలు చేపట్టారు. ఈ విపత్కర పరిస్థితులు లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేరుగా ప్రజల్లోకే వెల్లి యాసంగి లో తెలంగాణా రైతాంగం సాదించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేవారు.ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా తెలంగాణా ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు అండగా నిలబడి తెలంగాణాను దాన్యాగారంగా మార్చారు..ఈ ఆపత్కాలంలో దేశానికి తెలంగాణాను అన్నదాతగా మార్చారు.ఈ పరిస్థితుల్లో కూడా తన ముందుచూపుతో,తన కార్యదీక్ష,పట్టుదల,సంకల్పంతో తెలంగాణాను విజేతగా నిలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.తెలంగాణా నేలను బంగారు మాగాణంగా మార్చి తెలంగాణా రైతాంగం గుండెల్లో కొండంత సంతోషాన్ని నింపారు.శత్రువు సైతం వహ్వా అనేలా తన పనితీరుతో పసిడి సిరులనందించి తెలంగాణాను ఆదర్శంగా నిలిపారు..గ్రేట్ సీఎం కే.సీ.ఆర్ సార్..

– Vijay Thadaboina..
Warangal
9491998702