Home / EDITORIAL / తెలంగాణలో నడి ఎండల్లోనూ తడి ఆరని నేల తల్లి

తెలంగాణలో నడి ఎండల్లోనూ తడి ఆరని నేల తల్లి

సాధారణంగా వర్షం పడితేనే చెరువుల్లోకి నీళ్లు. ఆ తర్వాత నాలుగైదు నెలల్లోనే ఖాళీ. ఇక.. ఎండాకాలంలో చెరువు నెర్రెలుబారి మళ్లీ వరుణుడి కోసం ఎదురుచూస్తుంటుంది. తెలంగాణలో ఇది ఒకప్పటి మాట. కానీ, ఇప్పుడు మండువేసవిలోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలోని చారిత్రక గొలుసుకట్టు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. వర్షాకాలం మాదిరిగా నిండుకుండల్లా కళకళలాడుతున్నయి. రెండుబేసిన్లలో మొత్తం 43,759 చెరువులకుగాను ఇప్పటికీ రెండువేల చెరువులు అలుగు పారుతున్నాయి. మరో 25 శాతం చెరువుల్లో వందశాతం నీళ్లుండగా.. 15 శాతం చెరువుల్ల్లో 75 శాతానికిపైగా, 17 శాతం చెరువుల్లో సగానికిపైగా నీళ్లున్నాయి. అంటే.. రాష్ట్రంలోని 63శాతం చెరువుల్లో ఏప్రిల్‌ నెలలోనూ జలకళ ఉట్టిపడుతున్నది. గతేడాది అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్నే పూర్తిగా మార్చేసింది.

ఈ యాసంగిలో సాగువిస్తీర్ణంలో రికార్డు నమోదుచేయడమే కాకుండా.. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో దాదాపు 60-70 శాతం చెరువులు ఏప్రిల్‌ నెలలోనూ నిండుకుండలను తలపిస్తున్నయి. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే సూర్యాపేట, యదాద్రిభువనగిరి జిల్లాల్లోనూ దాదాపు 190 చెరువులు అలుగులు పోయడం కాళేశ్వరంతోనే సాధ్యమయింది. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో వలసలు తిరిగివచ్చి పూర్వవైభవాన్ని సంతరించుకున్న పాతపాలమూరులో 536 చెరువులు మత్తడి దుంకుతుండగా.. 700 చెరువులు 100% నీటితో ఉన్నాయి. వీటితోపాటు ప్రతి పాజెక్టునీటితో సాధ్యమైనంతవరకు ఎక్కువ చెరువులను నింపాలనే సీఎం కేసీఆర్‌ సంకల్పం నెరవేరడంతో ఎస్సారెస్పీ, దేవాదుల, కడెం, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుల పరిధుల్లో చెరువుల్లో జలకళ ఉట్టిపడుతున్నది.

ప్రాజెక్టుల పరిధిలో చెరువులు నింపినతీరు
ఎస్సారెస్పీ మొదటిదశ: కాళేశ్వరం నీటితో సుమారు 1000
శ్రీరాజరాజేశ్వర జలాశయం: 24
శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం: 114 (పెద్దపల్లి-1, కరీంనగర్‌-25, జగిత్యాల-28, రాజన్న సిరిసిల్ల-60)
ఎస్సారెస్పీ వరద కాల్వ: 56
ఎస్సారెస్పీ రెండోదశ: 489 (వర్దన్నపేట-09, పాలకుర్తి-83, డోర్నకల్‌-65, తుంగతుర్తి-157, సూర్యాపేట-88, కోదాడ-15)
భక్తరామదాసు : 72
ఎస్సారెస్పీ-2 పరిధిలోని డీబీఎంలు: 520
దేవాదుల ప్రాజెక్టు: 418
రాజీవ్‌ భీమా ప్రాజెక్టు: 248, కల్వకుర్తి: 574, కోయిల్‌సాగర్‌: 37, జూరాల: 185, నెట్టెంపాడు: 103, ఆర్డీఎస్‌: 05, ఆసిఫ్‌నగర్‌ ప్రాజెక్టు: 66, మూసీ: 44, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు: 99, నాగార్జునసాగర్‌ లోలెవల్‌ కెనాల్‌: 62. వీటిల్లో ఇప్పటికీ కొన్ని చెరువులు అలుగు పోస్తున్నాయి.
63శాతం చెరువుల్లో జలకళ

మొత్తం చెరువులు : 43,759

అలుగు పారుతున్నవి : 2,000

వందశాతం నీళ్లున్నవి : 10,939

మూడొంతులు నిండినవి : 6,564

సగం నిండిన చెరువులు : 7,439

ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో దాదాపు 60-70 శాతం చెరువులు నిండుకుండలే.
వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండే సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లోనూ దాదాపు 190 చెరువులు అలుగులు పోశాయి.
పాతపాలమూరులో 536 చెరువులు మత్తడి దుంకుతుండగా.. 700 చెరువులు నిండి ఉన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat