Home / SLIDER / దేశ రక్షణకు సన్నద్ధమవుతోన్న ‘మేఘా’

దేశ రక్షణకు సన్నద్ధమవుతోన్న ‘మేఘా’

మేఘా ఇంజనీరింగ్ మరో కీలక రంగంలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే సంస్థ దేశ, విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం, సహజ-చమురు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ, రోడ్డు మార్గాల ఆధునీకరణ, విస్తరణ విమానాయన రంగాలో ఎన్నో విజయాలు సాధించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎంఈఐఎల్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశ రక్షణ రంగంలోకి అడుగుపెడుతోంది.

మరో కీలక రంగంలోకి మేఘా..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో మేఘా ఇంజనీరింగ్ భాగస్వామ్యం అవుతోంది. ఇందులో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ-2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడిపరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు ఎంఈఐఎల్ గతంలోనే దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. మేఘా సంస్థ శక్తి-సామర్థ్యాలను పరిశీలించిన అనంతరం కేంద్రం మిలటరీకి వాహనాలు, ఆయుధాలతోసహా తయారుచేసేలా అనుమతులిచ్చింది. 1959 ఆయుధాల చట్టం కింద మేఘా సంస్థకు తాజాగా అనుమతి లభించింది. వివిధ దశల్లో 500 కోట్ల పెట్టుబడితో మేఘా గ్రూప్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇందుకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖలు అనుమతులు మంజూరు చేశాయి.

రక్షణ రంగంలో ‘మేఘా’ఏం చేయబోతుంది..

మేఘా గ్రూప్ కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్ర-సంకేతిక రంగాల్లో సహాయ-సహకారాలు అందిస్తున్న విషయం విధితమే. డిఫెన్స్ పరిశ్రమలో యుద్ధట్యాంకులు, వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధవాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్ ఉత్పత్తి చేస్తుంది. సైనికులను తీసుకువెళ్లే వాహనాలు(ఏపిసి) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్(ఐసివి), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగగలిగే యుద్ధ వాహనాలు(ఏసిటివి) మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది. ఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ తో పాటు విద్యుత్ ప్రసారం పంపిణీ, సౌర రంగల్లో కూడా నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అధునాతన కమ్యూనికేషన్ రెడియోలు, జామర్లు, ఈడబ్లూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరాలో నిమగ్నమయి ఉంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ను గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

కరోనా టైంలో మొబైల్ వైరాలాజీ ల్యాబ్ సృష్టించిన మేఘా..

కరోనా మహమ్మరి విజృంభిస్తున్న సమయంలోనే మేఘా ఇంజనీరింగ్ దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజి ల్యాబ్ తయారు చేసింది. గత ఏప్రిల్ నెలలో ఈ ల్యాబ్ ను ప్రారంభించింది. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీలోకి ప్రవేశించిన మేఘా సంస్థ ఐకామ్ టెలి, మొబైల్ వైరాలజీ పరిశోధన మరియు కోవిడ్-19నమూనాలను పరీక్షించడానికి డయాగ్నస్టిక్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ కోవిడ్ -19 స్క్రీనింగ్, సంబంధిత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను వేగవంతం చేయనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బయో-సేఫ్టీ ప్రమాణాల ప్రకారం ఈ మొబైల్ ల్యాబ్ ఐకామ్ సంస్థ నిర్మించింది.

వివిధ రంగాల్లో సత్తాచాటిన మేఘా..

మేఘా ఇంజనీరింగ్ దేశ, విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసింది. సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం, సహజ-చమురు , తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ, రోడ్డు మార్గాల ఆధునీకరణ, విస్తరణ విమానాయన రంగాలో ఎన్నో విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అరుదైన ఎత్తిపోతల పథకం హంద్రీనీవా సుజల స్రవంతిని నిర్మించింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం, పట్టిసీమ, నంబులపూలకుంట(ఎన్పీకుంట) విద్యుత్ సబ్ స్టేషన్ ను రికార్డు సమయంలో ఘనత ‘మేఘా’ పూర్తిచేసింది. ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ నైపుణ్యాలను దేశంలో అనేక ప్రాజెక్టు లను తొలిసారిగా ప్రవేశపెట్టింది. మేఘా సంస్థ అన్ని కీలక రంగాల్లో సత్తాచాటుతూ ముందుకెళుతోంది. తాజాగా దేశ రక్షణలో రంగంలోకి ‘మేఘా’ అడుగులు వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.