Home / TELANGANA / సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు సమావేశం

సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు సమావేశం

సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సిమెంట్‌ ధరను తగ్గించాలని మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి కంపెనీల ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ సూచనలకు సిమెంట్‌ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. వచ్చే వారంలో ఏ మేరకు ధర తగ్గించే విషయాన్ని తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు.

మరో మూడేళ్లపాటు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వపథకాలకు రూ.230కి ఒక సిమెంట్‌ బస్తా ఇచ్చేందుకు సిమెంట్‌ కంపెనీలు అంగీకారం తెలిపినట్లు సమాచారం.

హుజూర్‌ నగర్‌ ప్రాంతంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాల్సి ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు. యువతకు శిక్షణ ఇచ్చేందుకు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.