Home / SLIDER / తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు

తెలంగాణ ‌రాష్ట్రంలో రాగ‌ల మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్న‌ది.

దాని ప్ర‌భావంతో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ , నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వాటితోపాటు ఇత‌ర జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.